Tuesday, November 26, 2024

కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు.. దుష్టచతుష్టయం బుర్రలోనే విషయం ఉంది : మాజీమంత్రి కొడాలి నాని

అమరావతి, ఆంధ్రప్రభ: కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. కుట్రలు, కుతంత్రాలతో ఒళ్లంతా కుళ్లిపోయిన వ్యక్తి కల్తీ నాయుడు అంటూ మాజీమంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కల్తీ పార్టీ, ఎందుకంటే అది ఎన్టీ రామారావు పార్టీ అయినా చంద్రబాబు సిగ్గు లేకుండా తన పార్టీ అని చెప్పుకుంటాడని దుయ్యబట్టారు. విషం ఎక్కడో లేదు. చంద్రబాబునాయుడు బుర్రలో ఎల్లో మీడియాలోఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా సీఎం జగన్‌ను భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వాన్ని ఎలా అప్రదిష్టపాలు చేయాలని దుష్టచతుష్టయం కుట్రలు పన్నిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు.

రథాలు తగలబెట్టారు. విగ్రహాలు పగలగొట్టారు. ఆలయాల్లో ఆభరణాలు దొంగిలించడం. అన్నింటినీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. జగన్‌ క్రిస్టియన్‌. ఇక్కడ హిందువులకు భద్రత లేదని ప్రచారం చేసి, అరాచకాలు సృష్టించేందుకు విశ్వప్రయత్నం చేశారన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే, గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టారు. ఆ విధంగా కులాల మధ్య గొడవలు పెట్టి, రాష్ట్రాన్న్రి రావణకాష్టం చేయాలని కుట్రపన్నారన్నారు. లోకేష్‌ శవరాజకీయాలు వర్క్‌ అవుట్‌ కాకపోవడంతో చివరకు కొత్తగా విష ప్రచారం మొదలుపెట్టారన్నారు.

మద్యంలో విషం ఉందని, అరవిందో ఫార్మా మీద దుర్మార్గంగా విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ కంపెనీకి మొత్తం 24 మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయని, కేవలం తెలుగు రాష్ట్రాల్ల్రోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్ల్రోనూ, చివరకు విదేశాల్లోనూ మందులు అమ్ముతారని కొడాలి చెప్పారు. ఆ స్థాయిలో ఉత్పత్తి, వ్యాపారం చేసే కంపెనీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుది? ఎలాంటి ప్రమాణాలు పాటిస్తుందో తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కల్తీనాయుకి చెల్లిందన్నారు. విషం చంద్రబాబునాయుడు బుర్రలోనే ఉందని ఎద్దేవా చేశారు.

ఏబీవీకి థాంక్స్‌..

ఏబీ వెంకటేశ్వరరావుకు వైయస్సార్‌సీపీ నాయకుల తరుపున కొడాలి థాంక్స్‌ చెప్పారు. రాష్ట్రాన్న్రి తగలబెట్టకుండా చూసి, చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని భోగి మంటల్లో వేసి తగలబెట్టించినందుకు వైయస్సార్‌సీపీ నాయకులు తరుపున థాంక్స్‌ చెబుతున్నానన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement