Friday, November 22, 2024

Kalaparru – 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ప‌ట్టివేత

( ఆంధ్రప్రభచ, ఏలూరు బ్యూరో) : ఏలూరు జిల్లాలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో 50 కేజీలకు పైగా ఆభరణాలను గుర్తించారు. వీటిలో సుమారు 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఉన్నాయి.

పెదవేగి సీఐ శ్రీనివాస్‌కుమార్‌ మాట్లాడుతూ విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.15లక్షల నగదును సీజ్‌ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పీఎస్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement