న్యూఢిల్లీ/కడప – తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిది రాజకీయ హత్యనని తేల్చి చెప్పారు ఆయన కుమార్తె సునీతారెడ్డి.. ఆయనకు ఆర్ధికపరమైన చిక్కులు గానీ, లావాదేవీలు గాని లేవని అందుకు ఆయన హత్య రాజకీయంగా ప్రేరేపితమైందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు…. ఈ కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యంపై ఆమె నేడు కొత్త ఢిల్లీలోని సిబిఐ అధికారులను కలిశారు..హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా నిందితులను కాదు కదా కనీసం హత్య వెనుక ఉన్న మోటీవ్ ను కూడా కనుక్కోలేకపోయారనే విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఎపి ముఖ్యమంత్రికి స్వయాన బాబాయ్ అయిన వ్యక్తి హత్యకు గురైతే రెండేళ్లు అయినా నిందితులను పట్టుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆరోపించారు. తమకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితేంటని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. తన తండ్రి హత్య విచారణ కోసం పలువురు ఉన్నతాధికారులను కలిసిన సందర్భంగా అందులో కొందరు మీ ప్రాంతంలో హత్యలు సహజమంటూ కొట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కేసులో సాక్ష్యం చెబితే తాము కూడా హత్యకు గురవుతామనే భయాందోళలో పులివెందుల ప్రజలున్నారని సునీత చెప్పారు..భయపడుతున్న ప్రజలు ఉన్నంతకాలం నిజాలు ఎప్పటికీ భయటికి రావని ఆమె అన్నారు.. కాగా, తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని అన్నారు. ఇక తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement