కడప బ్యూరో: మూడేళ్ల లో 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన జగన్ ఏ విషయంపై అక్కడి వారిని కలిశారో చెప్పిన పాపాన పోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. శఅనివారం కడపలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని, హోం మంత్రిని, ఆర్ధిక మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగారా.? దేనికోసం ఢిల్లీ వెళ్లారో కూడా బ్రీఫ్ చేయలేదెందుకు అని ప్రశ్నించారు. ఏ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని పెద్దలను కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసుల కోసం వెళ్ళారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దావోస్ పర్యటన గురించి కూడా చెప్పకపోవడం బాధకరమన్నారు. అమలాపురం ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని మోపారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదున్నారు. రాజకీయ హత్యలు సాగుతున్నాయని, వీటిని ప్రశ్నిస్తే వాళ్లను హౌస్ అరెస్ట్ చేస్తారన్నారు. ఇలాంటి అరాచకం, అక్రమాలు ఎక్కడా లేవని, లక్ష కోట్ల మేర బిల్లులు బకాయి ఉన్నాయిని పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి లోబర్చుకునే జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement