Tuesday, November 26, 2024

పంట నష్టo జరిగిన రైతాంగాన్ని ఆదుకోవాలి.. కలెక్టర్ కు తెదేపా అగ్రనేతల విన‌తి..

కడప బ్యూరో : ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్సార్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2021 పరిహారం పంపిణీలో నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, పంట సాగు చేసి నష్టపోయినా పరిహారం అందలేదని, పంట సాగు చేయని భూ యజమానులకు పెద్ద ఎత్తున పరిహారం అందిందని అనర్హుల పై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ విజయ రామరాజు ను జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన అగ్ర శ్రేణి నాయకులు అందరూ కలిసి వినతి పత్రం సమర్పించి చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర హెచ్ ఆర్డీ సభ్యుడు భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ చార్జి ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ముక్తియార్, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర లీగల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుర్రప్ప, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు బాలస్వామి రెడ్డి, కేసి కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నేట్లపల్లి మల్లికార్జున యాదవ్, పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్, రాష్ట్ర బెస్త సాధికార సమితి అధ్యక్షులు రాంప్రసాద్, పార్లమెంట్ యువత అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరాం, తెలుగు యువత జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

లింగారెడ్డి అరెస్టు అక్రమం..

అర్హులైన రైతులందరికీ పంటల భీమా వర్తింప జేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రొద్దుటూరు నుండి కడప కు వస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్హమని ప్రొద్దుటూరు టిడిపి ఇన్ఛార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను కలెక్టర్ దృష్టికి తేవడాన్ని కూడా అడ్డుకోవడంపై మండిపడ్డారు. టిడిపి నేతల వినతిపత్రం ఇవ్వడాన్ని కూడా ప్రభుత్వం భయపడుతుందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకోవడం ముఖ్యమంత్రి మూర్ఖత్వమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు సాధిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకోవడం చూస్తే ముఖ్యమంత్రికి తన మాట పై నమ్మకం కోల్పోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement