Wednesday, November 20, 2024

సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : ఎస్పీ అన్బురాజ‌న్‌

కడప బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో అక్కడి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన విషయమై వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో అవాస్తవాలను, వదంతులను ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా సున్నితమైన అంశాలలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసే వారిపై, షేర్ చేసే వారిపై, ఆయా గ్రూప్ అడ్మిన్లపై నిఘా ఉంచామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఫేక్ పోస్టులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement