Saturday, November 23, 2024

బంద్ ను జయప్రదం చేయండి – రౌండ్ టేబుల్

ప్రొద్దుటూరు, – ఈ నెల 26న బంద్ జయప్రదం చేయాలని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన లభిస్తుంది రైతులు దాదాపు నాలుగు నెలల నుంచి ఆందోళన చేస్తుంటే వారి సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ప్రభుత్వ సంస్థలు కారుచౌకగా ప్రైవేటు వారికి ఇవ్వడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు ప్రభుత్వ సంస్థలకు కాపలాగా ఉండమని ప్రజలు ఓట్లు వేసి అధికారం కల్పిస్తే ఈ రకంగా ప్రైవేటుగా అమ్మడం ఏమిటది సిగ్గుచేటు మరొకటి ఉంది అని అన్నారు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు రోజు రోజు పెంచుకుంటూ పోతే నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి పేదవారికి పౌష్టికాహారం దూరమవుతుందని మూడు పూటలా తిండి కరువు అవుతుందని అన్నారు. శుక్రవారం బందులో పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ వ్యాపారస్తులు ఆటో కార్మికులు ప్రైవేట్ బస్సులు ఆర్టిసి ప్రతి ఒక్కరూ బందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని పద్ధతిలో నిరసన తెలపాలని అన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నజీర్ అహ్మద్ సుజనా శీను విద్యార్థి సంఘం నరేష్ విరసం కార్యదర్శి వరలక్ష్మి సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్ సిపిఎం పార్టీ నాయకులు చెన్నారెడ్డి సుబ్బారావు ఐ ఎన్ ఎల్ యూనియన్ కార్యదర్శి ప్రసాద్ మహిళా సంఘం నాయకులు వెంకటసుబ్బమ్మ బీసీ సంఘం నాయకులు గురప్ప ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ధనలక్ష్మి కొండయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement