పులివెందులలోని రవీంద్రనాథ హై స్కూల్ సమీపంలో గల ఎస్సీ హాస్టల్ ను మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ ని కలిసి అక్కడ పరిస్థితులను ఆరా తీశారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత గురించి , విద్యార్థిని విద్యార్థులకు అందించేటువంటి పౌష్టిక ఆహారం గురించి మరియు ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తూ అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని, విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసించే విధంగా హాస్టల్ ప్రాంతాలను తీర్చిదిద్దాలని అన్నారు. మొత్తం మీద హాస్టల్ ఆవరణంలో చేపడుతున్న టువంటి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసి హాస్టల్ వార్డెన్ రామాంజనేయులు అభినందించారు.. అలాగే హాస్టల్ విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ కిషోర్ మరియు వైసీపీ నాయకులు నిమ్మకాయల రవి హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement