Thursday, November 21, 2024

మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి

చెన్నూరు : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కమలాపురం శాసనసభ్యులు పి , రవీంద్రనాథ్రెడ్డి అన్నారు, శనివారం ఆయన సామాజిక ఆరోగ్య కేంద్రం (సి హెచ్ సి) లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు, ఎక్కడ ఎక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిపై తక్షణ చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడంతోపాటు, పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు, ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూడాలని వారిని ఆదేశించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక దృష్టిసారించారు అన్నారు, గతంలో పెద్దపెద్ద జబ్బులకు అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు, అలాంటిది నేడు రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు, ఇప్పటికే 750 పడకల కెపాసిటీ గల అన్ని వసతులతో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, ఇప్పటికే వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు పెద్దపెద్ద జబ్బులకు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఎంపిక చెయ్య బడిన ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు, పేద ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే టందుకు, అన్ని మౌలిక వసతులతో వైద్యశాలను మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందన్నారు, గతంలో 11 మెడికల్ కాలేజీలు , హాస్పిటల్స్ మాత్రమే ఉండేవని నేడు అదనంగా 16 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు 13 జిల్లాలలో చేయడం జరుగుతుందన్నారు, అందులో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో 6 కోట్ల 70 లక్షలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు, ఇందులో చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ( సి హెచ్ సి) కి 4 కోట్ల 70 లక్షలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు, ఇందులో భాగంగా ఆసుపత్రి ఆధునీకరణ తో పాటు, మౌలిక వసతుల కల్పన, మార్చురీ, అంబులెన్స్ ల షెడ్డు లు, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులు, తో పాటు ఎక్కడ కూడా వైద్యుల కొరత లేకుండా చూడడం, ఆసుపత్రికి సంబంధించి సామాగ్రి కొరత లేకుండా చూడడం జరుగుతుందన్నారు, ఇలా చేయడం ద్వారా పేద ప్రజలందరికీ మెరుగైన టువంటి వైద్యం అందించడం జరుగుతుందన్నారు, సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఏపీ ఎం ఎస్ ఐ డి సి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అధికారులు అన్ని పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు, ఈ పనులు కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ ఈ , డి ఈ, ఎస్ ఈ లకు ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చెన్నారెడ్డి, తాసిల్దార్ అనురాధ, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement