కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇది వింటుంటే మీకు స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తోస్తుంది కదా. అచ్చం రీల్ కథను రీయల్ చేసి చూపించాడు నంద్యాలకు చెందని మహమ్మద్ రఫీ.
కాగా స్టూడెంట్ నెం.1లో హత్య కేసులో జైలుకు వెళ్లిన హీరో.. తన తండ్రి ఆశయాన్ని నెరవర్చాలనుకుంటున్నాడు. తన తండ్రి కొరిక మేరకు జైలులో ఖైదీగా ఉంటూనే లా పట్టా పొందుతాడు. ఇప్పుడు అచ్చం అలానే మహమ్మద్ రఫీ కూడా చేసి చూపించాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోములకు చెందిన మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడైన మహమ్మద్ రఫీపై ఓ కేసులో నేరరోపణ రుజువైంది. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. కానీ తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని భావించాడు.
జైలు అధికారుల సహకారంతో తాను అనుకున్నది సాధించాడు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకం సాధించారు. ఈ నెల 28న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ జగదీష్ నుంచి పతకాన్ని అందుకున్నారు.ఈ మేరకు బెయిల్‌పై వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్న రఫీ అనంతరం తిరిగి కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు. కాగా జైలు జీవితంతో కృంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.