Friday, November 22, 2024

రసాయన శాస్త్ర పరిశోధనలపై సీతా జస్వంత్ కు డాక్టరేట్

మైదుకూరు కు చెందిన సీతా జస్వంత కు అనంత‌పురం జేఎన్టీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కాలేజీ, రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ మల్లవరపు ఉమామహేష్ పర్యవేక్షణ లో ఏ స్టడీ ఆన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాటస్ నానోకాంపోసిట్ ఫాబ్రిక్స్ విత్ ఇస్ సైటు జెనరేటెడ్ మెటల్ నానోపార్టికల్స్ యూసింగ్ ప్లాంట్ ఎక్స్ ట్రాక్ట్ ” అనే అంశము పైన పరిశోధనసిద్ధాంత గ్రంథానికి గాను డాక్టరేట్ ను జేఎన్టీయూఏ పరీక్షల నియంత్రణాధికారి సి.శశిధర్ ప్రకటించారు. మొక్కలలో వుండే రసాయనాలను ఉపయోగించుకోని నానో సైజు లో లోహ పరమాణువులను దూది గుడ్డ ఉపరితలం మీద ఎలా తయారు చేయాలని, మరియు వాటి ఆంటీ బాక్టీరియల్ ధర్మాలను ఏవిధంగా స్టడీ చేయాలి. అనే అంశాలను ఈ పరిశోధన గ్రంధం లో ప్రచురించారు. ఈ పరిశోధన కు సంభందించి ఆరు పరిశోదన పత్రాలు వివిధ రకాల ప్రాముఖ్యత కలిగిన టైలర్ & ఫ్రాన్సిస్ జర్నల్స్ లో ప్రచురింపబడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement