Thursday, September 12, 2024

AP: క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి… కలెక్టర్ శివశంకర్ లోతేటి

కడప ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : క్రీడల వల్ల భౌతిక వికాసం, దేహదారుఢ్యం పెరుగుతుందని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను జీవితంలో భాగంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. గురువారం స్థానిక డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మైదానం నందు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే లో భాగంగా వివిధ రకాల క్రీడాకారులకు పోటీలను నిర్వహించి బహుమతుల ప్రధానం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఆరోగ్యమే మహాభాగ్యమ‌ని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని భౌతిక వికాసం, దేహదారుఢ్యం, మానసిక వికాసం పెంచుకోవాలని క్రీడల వల్ల భోజనాలు ఉన్నాయన్నారు. యువత, విద్యార్థినీ విద్యార్థులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. క్రీడల్లో మెలుకువలను తెలుసుకొని రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు నేషనల్ స్పోర్ట్స్ డే ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వైయస్సార్ కడప జిల్లాలో అతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు.

అందులో భాగంగానే నెల 25వ తేదీ నుండి అనేక కార్యక్రమాలు 20రకాల క్రీడా పోటీలను నిర్వహించి, జిల్లాస్థాయిలో పోటీలను నిర్వహించి క్రీడాకారులంద‌రికీ కూడా బహుమతులు ప్రధానం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని, యువతలో విద్యార్థినీ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆసక్తి పెంచడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రతి దినం దినచర్యలో భాగంగా క్రీడను ఎంచు కొంటే ఒక భౌతిక వికాసం, దేహదారుద్యం, మానసిక వికాసం పెరుగుతుందన్నారు. క్రీడల వల్ల ఏక ప్రయోజనాలు ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వారి దినచర్యలో ఏదో ఒక క్రీడను జీవితంలో భాగంగా అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని సందేశం ఇవ్వడం కోస‌మే మన రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ డే ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -

తొలుత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అంతకు మునుపు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్థానిక కోటిరెడ్డి సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి చేతుల మీదుగా 3 కి.మీ.ల ర్యాలీని క్రీడాజ్యోతిని వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్ నుండి ప్రారంభమై 7 రోడ్లు, పాత రిమ్స్ సర్కిల్, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం మీదుగా డీఎస్ ఏ స్టేడియం (మున్సిపల్ స్టేడియం) వరకు కొనసాగి ముగిసింది. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ జగన్నాథ్ రెడ్డి, స్టెప్ సీఈవో సాయి గ్రెస్, వివిధ క్రీడల క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement