కడప బ్యూరో – ప్రభ న్యూస్ : వైఎస్ఆర్ కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కడప ఎస్పీ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
బాధ్యతల స్వీకరణకు ముందు ఆయన మొదటగా తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల నిర్వహణలో పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగా జరిగిన ఎస్పీల బదిలీల్లో హర్షవర్ధన్ రాజు తిరుపతి జిల్లా నుంచి కడపకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతల స్వీకరణ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -