Thursday, September 12, 2024

Kadapa: సత్వర న్యాయ పరిష్కారం కోసం.. పర్మినెంట్ లోక్ అదాలత్!

శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్
కడప ప్రతినిధి, ఆగస్టు, 31 (ప్రభ న్యూస్) : ప్రతి ఒక్కరికి ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన ఉండాలని పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కడప నాగరాజుపేటలో ఉన్న ఎస్ కెఆర్ అండ్ ఎస్ కెఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్ (ఏ) లోని ఆడిటోరియంలో శాశ్విత లోక్ అదాలత్ ఆధ్వర్యంలో.. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ అధ్యక్షతన ప్రజా వినియోగిత సేవా రంగాల్లో న్యాయ సేవలపై.. కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ (హిందీ) పి.ఎం.ఆర్. జయంతి, ప్రిన్సిపాల్, లెక్చరర్స్, స్టూడెంట్స్ లతో అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే క్లియర్ చేయాలని, ఆయా శాఖల వారీగా కేసులపై సమీక్షించారు. ప్రతి ఒక్కరికి ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన ఉండాలని, ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందివ్వడం జరుగుతుందన్నారు.

మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా కోర్టు ఆవరణలోని పర్మనెంట్ లోక్ అదాలత్ కార్యాలయంలో సంప్రదించవచ్చని లేదా సెల్ నెంబర్లు : 8639684279, 9963731698 లకు కాల్ చేసి చట్టముపై సరైన అవగాహన పొందవచ్చని తెలియజేశారు.

- Advertisement -

పర్మినెంట్ లోక్ అదాలత్ ద్వారా.. పరిష్కారం కాదగిన ప్రజా ప్రయోజిత సేవల వివరాలు..

  1. రవాణా సేవలు: రోడ్డు, రైల్వే నీటి మరియు విమాన సేవలకు సంబంధించి ప్రయాణీకులు తరలింపు, సరుకుల రవాణా సేవలు..
  2. పోస్టల్, టెలిగ్రామ్ మరియు టెలిఫోన్ సేవలు.
  3. పవరు, విద్యుత్ (ఎలక్ట్రిసిటీ) మరియు నీటి సరఫరా సేవలు.
  4. మునిసిపాలిటి, గ్రామ పంచాయతీల సేవలకు సంబంధించి.. మురుగునీటి కాల్వల నిర్వహణ, ప్రజా సౌకర్యముల ఏర్పాటు లాంటి సేవలు.
  5. ప్రజా ఆరోగ్యం మరియు వైద్య చికిత్సా కేంద్రములకు సంబంధించి.. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ సేవలు.
  6. భీమా రంగానికి సంబంధించి… జీవిత భీమా మరియు సాధారణ భీమాలు ప్రభుత్వ మరియు ప్రవేట్ రంగాలలో జీవిత భీమా, వాహన భీమా, పంటల భీమా, గృహ భీమా మొదలుగు సేవలు
  7. బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల సేవలు.
  8. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సేవలు.
  9. విద్య, విద్యాసంస్థలకు సంబంధించి.. ప్రభుత్వ మరియు ప్రవేట్ విద్యా సంస్థల సేవలు.
  10. స్థిరాస్తి వ్యాపారము (రియల్ ఎస్టేట్): ప్లాట్స్, గృహ నిర్మాణ సేవలు.

ఈ కార్యక్రమంలో ఎస్ కె ఆర్ అండ్ ఎస్ కె ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్, నాగరాజుపేట, కడప కాలేజ్ ప్రిన్సిపాల్ వి. సలీం బాషా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ పి.ఎం. ఆర్. జయంతి, డిపిఎండీబీసీఎస్ బి. సునీత, రవికుమార్, కె.సుధాకర్ రెడ్డి, లెక్చరర్స్, స్టూడెంట్స్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement