అమరావతి, ఆంధ్రప్రభ : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి దాదాపు నాలుగేళ్ళ సుదీర్ఘ విచారణలో కీలకదశకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వివేకా కుమార్తె సునీత పోరాటంతో కడప నుంచి హైదరాబాద్ సీబిఐ కోర్టుకు విచారణ మారిన క్రమంలో అంతే వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసుకు సంబంధించి కోర్టు విచారణ ఓవైపు.. సీబిఐ దర్యాప్తు మరోవైపు ఈ రెండు పరిణామాలు వివేకా కేసు వెనుక మిస్టరీని అతి త్వరలోనే చేధించబోతున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే గతంలో అరెస్టయిన నిందితులు ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో ఇద్దరికి కోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే కడప కోర్టులో ఆగిపోయిన నిందితుల విచారణ ఇప్పుడు హైదరాబాద్ సిబిఐ కోర్టులో ప్రారంభం కావడంతో అక్కడ జైలులో ఉన్న నిందితుల హాజరు ప్రస్తుతం కీలకంగా మారింది. పైగా ఈ కేసులో వారే ప్రధానం. ఈనెల 10వ తేదీ సీబిఐ కోర్టుకు హజరుకానున్న వీరి విచారణతో కేసు ఓ కొలిక్కి రానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప కేంద్రంగా జరిగిన కేసు దర్యాప్తులో అరెస్టయిన వారిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డిలు ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. కాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబిఐ సవాల్ చేయగా ప్రస్తుతం దీనికి సంబంధించి తెలంగాణా కోర్టులో నిర్ణయం పెండింగ్‌లో ఉంది. ఇక అప్రూవర్ గా మారిన దస్తగిరి వివేకా కేసుకు సంబంధించి నాలుగేళ్ళ తర్వాత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈనెల 10వ తేదీన జరిగే కోర్టు విచారణనుద్ధేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు హాజరుకా వాల్సిన నిందితులు సునీల్ యాద వ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు ప్రస్తుతం కడప సెంట్రల్ జై లులో ఉన్నారు. వీరికి ఇప్పటికే సిబిఐ అధికా రులు కోర్టు సమన్లు అందచే శారు. దస్తగిరి, గంగిరెడ్డిలకు కూడా అధికారులు నోటీసులి చ్చారు. దీంతో ఈ ఐదుగురు 10వ తేదీన సిబిఐ కోర్టులో విచార ణకు హైదరాబాద్ రావాల్సి ఉంది.
భద్రతపై మల్లగుల్లాలు
వివేకా కేసులో ఎ ంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ కార్యాలయంలో ప్రశ్నించిన సీబిఐ ఆయన కాల్ లిస్ట్ ఆధారం గా సీఎం జగన్ ఓఎస్‌డీ, ఆ ఇంటి మనిషి నవీన్‌లకు నోటీసులివ్వడం వారిని మాత్రం కడప సెంట్రల్ జైలు ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో విచారించడం ఇక్కడ ప్రధానాంశమని న్యాయనిపుణులు అంటున్నారు. వీరిద్దరిని ప్రశ్నించిన మీదట అధికారులు జైలులోని నిందితులను కూడా టచ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. దస్తగిరి, గంగిరెడ్డిలు కూడా కడప సెంట్రల్ జైలు ఆవరణలో సిబిఐ అధికారుల వద్దకు వచ్చారు. జైలులో ఉన్న ముగ్గురు నిందితులను ఈనెల 10వ తేదీన హైదరాబాద్ సిబిఐ కోర్టు విచారణ అనంతరం సిబిఐ అధికారులు వారిని విచారించేందుకు న్యాయస్ధానం అనుమతి కోరే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అదేవిధంగా గంగిరెడ్డి, దస్తగిరిలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంద నే ప్రచారం జరుగుతోంది.
అయితే అటు కోర్టు విచారణ గాని, ముందు ముందు సిబిఐ విచారణకు గాని జైలు లోని నిందితులు హాజర య్యే విషయంలో వారి భద్రత సున్నితాం శంగా మారింది. ఈనెల 10వ తేదీన నిందితులను కడప జైలు నుంచి హైదరాబాద్ తరలించే విషయంలో కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ ్స పొందిన అధికారులు కడప పోలీసు ఉన్నతాధికా రులను ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. 10వ తేదీ విచారణకు హాజరుకావాలంటే ఒక రోజు ముందో.. రాత్రో బయలుదేరాల్సి ఉంటుం ది ఇది మరీ జ ఠిలమైన పరిస్ధితి. దీంతో రక్షణపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముందు ముందు కూడా విచారణకు హాజరయ్యే ప్రతీసారీ భద్రతకు సంబంధించి ఇదే పరిస్ధితి అందువల్ల వీడియో లింకేజీ ద్వారా విచారణ జరపడమా లేక ఖైదీలను చంఛల్ గూడకు తరలిం చడమా అనే మీమాసం కొనసాగు తున్న ట్లు తెలు స్తోంది. మరోవైపు తనకు రక్షణ కావాలంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి సైతం వ్యాఖ్యానించడం మరింత బలం చేకూరుతోంది. మొత్తం మీద 10వ తేదీ తర్వాత వివేకా కేసులో మరికొం దరు ముఖ్యులకు సిబిఐ నోటీసులు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.