నేడు కడపలో భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేసింది. రాయలసీమ రణభేరి పేరిట ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్కక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కేంద్ర నేతలు కూడా పాల్గొనే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేస్తుండటం విశేషం. గత మూడేళ్లుగా రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, వనరులను వినియోగించుకోకుండా ప్రభుత్వం సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఈ సభలో బీజేపీ నేతలు నిలదీయనున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వినియోగించడం లేదన్న ఆరోపణలు చేయనున్నారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతానికే అన్యాయం చేస్తున్నారని ఈ సభ ద్వారా బీజేపీ నేతలు ప్రజలకు తెలియజేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement