Tuesday, November 19, 2024

బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

క‌ర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో నంద్యాల పార్లమెంట్ బీజేపీ అధ్య‌క్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పత్రాలను కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్ కు బీజేపీ నేతలు అందజేశారు. పత్రాలను పరిశీలించిన అనంతరం సూపరింటెండెంట్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ శ్రేణులు కేంద్ర కారాగారం వద్దకు భారీగా చేరుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించారు. ఆయ‌న‌కు బీజేపీ నేత‌లు స్వాగతం పలుకుతూ… భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement