ప్రొద్దుటూరు, – మనసు కవిగా సుప్రసిద్దులైన స్వర్గీయ ఆచార్య ఆత్రేయ శత జయంతి సందర్భంగా శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాములపేటలోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో తెలుగు భాషా పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆచార్య ఆత్రేయ శత జయంతి ఉత్సవం జరిగింది .ఈ సందర్భంగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ దక్షిణ భారత చలన చిత్ర మండలి పూర్వ సభ్యులు డాక్టర్ పంజగల మధుసూదన్ బాబు లు ఆత్రేయ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ప్రసంగిస్తూ ఆత్రేయ నాటక రచయిత గా సినిమా పాటల ,మాటల రచయిత గా నిర్మాత గా, దర్శకుడు గా విశేషంగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆత్రేయ సినీ గేయ రచయిత గా ప్రజల నాడిని అద్భుతంగా పట్టుకున్నారని తన పాటల ద్వారా సినీ అభిమానుల్లో మనసు కవిగా గుర్తింపు పొందారని తెలిపారు. భావం, భాష శైలిలో మార్పులు తెచ్చి సినిమా పాటను సినిమా పాటగానే నిలబెట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకేపాటి శంకర్ రెడ్డి , సి పి ఎస్ నాయకులు రిజ్వాన్ ,విశ్రాంత అధ్యాపకులు కోటా ఓబుళ రెడ్డి , పిఎల్టీయు గడ్డం రాజు, హరిదాసు రమణయ్య తదితరులు పాల్గొన్నారు
ఘనంగా మనసు కవి ఆచార్య ఆత్రేయ శత జయంతి వేడుకలు
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement