Friday, November 22, 2024

సస్యరక్షణతోనే అధిక దిగుబడి సాధ్యం

బ్రహ్మంగారిమఠం : మండల పరిధిలోని రైతులు వేసవి కాలంలో సాగు చేసే వివిధ రకాల కూరగాయల పంటలకు సస్యరక్షణ తోనే అధిక దిగుబడి సాధ్యమని ఒనిపెంట ఏరువాక శాస్త్రవేత్త యుగంధర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని సోమిరెడ్డిపల్లె, పలుగురాళ్లపల్లె, గొల్లపల్లె, గ్రామాల్లో సాగుచేసిన టమోటా, వంగా, మరియు జామ, తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో ప్రస్తావిస్తూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల పంటల దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు తగ్గ సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు. సాగు చేసిన పంటలు పూత దశలో ఉన్నాయని వేసవి కారణంగా పూత రాలిపోకుండా బోరాన్ ను పిచికారి చేయాలి అన్నారు. అలాగే బీర పంటకు ఊత కర్రలను బాతించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement