Tuesday, November 26, 2024

కడప జిల్లాలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఏజీఅండ్ పీ ప్రథమ్

ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే ఐదేళ్లలో కడప జిల్లాలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు జిల్లాలో 500 మందికి పైగా ప్రజలకు ప్రతక్ష, పరోక్ష ఉపాధిని కూడా అందిస్తాయి.


ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ కడప జిల్లా ప్రాంతీయాధిపతి గుమాలపల్లి వెంకటేశ్ మాట్లాడుతూ.. కడపను స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోందన్నారు. ఇందుకోసం చవకయినా సహజవాయువును సులభంగా అందిస్తోందన్నారు. దీంతో ఈ జిల్లా ప్రజలు తమ జీవితాలను మరింత సుఖంగా గడపగలరన్నారు. ప్లాంట్, పైప్‌లైన్ నిర్మాణానికి సహకరించిన జిల్లా అధికారులకు ప్రత్యేకముగా ధన్యవాదములు తెలుపుచున్నామన్నారు. LCNG స్టేషన్ ఏర్పాటు అనేక డిమాండ్ కేంద్రాలకు గ్యాస్ సరఫరా చేయడానికి ఉద్దేశించబడింది, పెట్రోలియం & సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ద్వారా పేర్కొన్న సహజ వాయువు పైప్‌లైన్‌ల భద్రతా ప్రమాణాలతో సహా అన్ని సాంకేతిక ప్రమాణాలు, స్పెసిఫికేషన్‌లను అనుసరిస్తుందన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పరిధిలోకి వచ్చే పుట్లంపల్లి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా (IDA)లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement