Monday, November 25, 2024

భగత్ సింగ్ కి ఆమ్ ఆద్మీ పార్టీ నివాళి …

ప్రొద్దుటూరు, : స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ కు వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రొద్దుటూరు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ ఫిజా దస్తగిర్ స్థానిక శివాలయం రోడ్డు లోని శ్రీనివాసనగర్ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కొరకు అనేకమంది నాయులు వీరిలో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాలాలజపతిరాయ్, చంద్రశేఖర్ఆజాద్, బాలగంగాదరతిలక్, బి కె దత్ మొదలగు వారని ఆకాలంలో వ్యక్తిగతంగా కూడా ఉగ్రవాద చర్చలకు పాల్పడటం జరిగిందని పోలీసులు జరిపిన ఒక లాఠీఛార్జ్ లో లాలాలజపతిరాయ్ తీవ్రగాయాలయ్యి మరణించడాని ఈమహనాయకుడు మరణానికి నిరసనగా భగత్ సింగ్ తన సహచరులు తో పాటు లాలాలజపతి రాయ్ మీద లాఠీచార్జీ ఆదేఆశించిన అధికారిని హత్యచేసారని దాని తర్వాత కేంద్రశాసనసభ లో తన సహచరులు తో కలిసి శాసనసభ సభలో బాంబులువిసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ అందుకు ఆయన స్వచ్చందంగానే అరెస్టు అయ్యారని అందువలన ఆయనను సహచరులు తో పాటి1931 మార్చి23న భగత్ సింగ్ ను ఉరితీశారని వివరించారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, కార్యదర్శి యూనస్ హుస్సేన్, బాష, మల్లి, మురళి, గుర్రప్ప, రామచంద్ర, అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement