Tuesday, November 26, 2024

చట్టం తన పని తాను చేసుకు పోతుంది … ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..

కమలాపురం – అమరావతి లో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ ల్యాండ్ పుల్లింగ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్రఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు . కోగటంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి తో కలిసి మాట్లాడారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ళ పదవీకాలంలో అమరావతిలో వందల ఎకరాలు దోచుకున్నారని అన్నారు . ఆర్థిక మంత్రి డాక్యుమెంట్ నెంబర్లతో సహా నిరూపించారన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబుకు సిఐడి నోటీసులు అందించారన్నారు. విచారణ ప్రారంభం అవుతుందన్నారు. గతంలోనే నోటీసులు ఇస్తే చంద్రబాబు వ్యవస్థలను మెసేజ్ చేసి స్టేలు తెచ్చుకొని విచారణకు హాజరు కాలేదన్నారు .కోర్టు స్టే కారణంగా ఇన్నాళ్లు విచారణ జరగలేదని ఇప్పుడు కోర్టు చెప్పడం వల్లనే విచారణకు రావాలని చంద్రబాబును సిఐడి నోటీసులు జారీ చేసిందన్నారు .చంద్రబాబు చేసిన అవినీతి ఒక్కొక్కటి రుజువు అవుతాయన్నారు .చట్టం ముందు అందరూ సమానులే అని కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు .ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాలంలో తన ఐదేళ్ల పరిపాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు కమీషన్ల కోసమే పనులు చేశారన్నారు. అమరావతి ల్యాండ్ పుల్లింగ్ లో లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం పరిచారు .స్టె కారణంగా తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ చివరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంద న్నారు .చంద్రబాబు త్వరలోనే ఊచలు లెక్కించగా తప్పదన్నారు ఆయన అవినీతి భాగోతం త్వరలోనే బయటపడుతుందని చట్టం ముందు అందరూ సమానులే నని చుట్టాలు కారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement