Saturday, November 23, 2024

తస్మాత్ జాగ్రత్త: ఉద్యోగాల పేరుతో మోసం

కడపలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హోంగార్డు, రైల్వేలో ఉద్యోగాల ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ అదుపులో తీసుకున్నారు. నకిలీ అపాయింట్ మెంట్ అర్డర్స్ తో నిరుద్యోగులను బురిడి కొట్టించారు. పులివెందులకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులో వచ్చింది. జిల్లాలో 8 మంది దగ్గర రూ.6.20 లక్షల నగదు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, సెల్ ఫోన్, కలర్ ప్రింటర్ స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ సునీల్ సూచించారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై పొలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement