.శ్రీశైలం ప్రభ న్యూస్. కార్తీక సోమవారం సందర్భంగా సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు మరియు పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా ఇవ్వబడ్డాయి.కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇవ్వడం జరిగింది.ఆ తరువాత ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పించారు
.1. ఓంకారహారతి:దశహారతులు – దర్శనఫలంపరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం.ఈ ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి.
.2. నాగహారతి :ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలిగిపోతాయి. సంతానం కలుగుతుంది
.3. త్రిశూలహారతి:ఈ త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి.
4. నందిహారతి:ఈ నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి
.5. సింహహారతి:ఈ సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది
.6. సూర్య హారతి :ఈ సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది
.7. చంద్రహారతి:ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలిగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
.8. కుంభహారతి:ఈ కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.
.9. నక్షత్రహారతి:ఈ నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం అభిస్తుంది
.10. కర్పూరహారతి :ఈ కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.