Saturday, January 25, 2025

AP | దేవదాయశాఖ కమిషనర్ గా కె.రామచంద్ర

  • కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ…
  • వేద ఆశీర్వచనం చేసిన దుర్గగుడి అర్చకులు…
  • అభినందనలు తెలిపిన అధికారులు, సిబ్బంది..

( విజయవాడ,ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ గా కె.రామచంద్ర మోహన్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. గొల్లపూడి లోని దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించారు.

ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ఈఓ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితుల వేదాశీర్వచనాల నడుమ ఆయన శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన దేవస్థానాల నుండి అర్చకులు, వేదపండితులు విచ్చేసి ప్రసాదం అందచేసి వేదాశీర్వచనం చేశారు.

అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్ , చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్.శేఖర్ , ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గంగయ్య, స్థపతి పరమేశప్ప, జాయింట్ కమిషనర్ భ్రమరాంబ,లీగల్ ఆఫీసర్ కె. సూర్యారావు, ఉపకమిషనర్లు హెచ్.జి.వెంకటేష్, బి. మహేశ్వర రెడ్డి, తదితర అధికారులు, ఉద్యోగినీ ఉద్యోగులు నూతన కమిషనర్ రామచంద్ర మోహన్ ని కలిసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement