కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి ఇవ్వాల (శుక్రవారం దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుమల చేరుకున్న జస్టిస్ సంతోష్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆయనకు ఆలయన అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా, తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి భారీగా భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. తిరుమలలో నిన్న(గురువారం) 67,625 మంది భక్తులు దేవదేవుడిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే రూ.4.05 కోట్లు హుండీ ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.