ఏపీలో ఇవాళ, రేపు భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పర్యటించనున్నారు. ఇవాళ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విభాగం నివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు 10వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం చేస్తారు.. సీజేఐ పర్యటన ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఇక, ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి తిరుమల చేరుకోనున్నారు సీజేఐ చంద్రచూడ్ దంపతులు.. రాత్రికి తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో బస చేస్తారు.. రేపు ఉదయం అనగా బుధవారం రోజు తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు సీజేఐ.
ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.. రేపు ఉదయం 11 గంటలకు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకోని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు సీజేఐ డీవై చంద్రచూడ్. కాగా, గతంలోనూ తిరుమలలో పర్యటించిన సీజేఐ చంద్రచూడ్.. శ్రీవారిని దర్శించుకున్న విషయం విదితమే.