Thursday, November 21, 2024

ఏపీలో రేపటి నుంచి జూడాల సమ్మే..

ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపటి నుంచి నాన్ కోవిడ్ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది. సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలన్న డిమాండ్ తో పాటు స్టైఫండ్ లో టీడీఎస్ కట్ చేయకూడదని వారు కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు. అయితే విడుతల వారీగా సమ్మెను ఉధృతం చేయనున్నారు జూనియర్ డాక్టర్లు.. ఈ నెల 9 న కోవిడ్ కు సంబంధం లేని విధుల బహిషరించనున్న డాక్టర్లు…10 వ తేదిన కోవిడ్ సంబంధిత విధుల బహిష్కరణ చేయనున్నారు. ఇక 11న కోవిడ్ సంబంధం లేని అత్యవసర విధుల బహిష్కరణ చేసి మరుసటి రోజు అంటే 12న కోవిడ్ సంబంధిత అత్యవసర విధుల బహిష్కరణ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు పంపారు జూనియర్ డాక్టర్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement