తిరుపతి : రాయలసీమలో వరదల కారణాలపై న్యాయ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రోజులుగా కడప, తిరుపతిలోని ముంపు ప్రాంతాలలో పర్యటించానని….చెన్నై వర్షాల ఎఫెక్ట్ కడప, చిత్తురు, అనంతపురం, నెల్లూరుపై పడిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే… రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వాతావరణ శాఖ సూచనలు చేసినా ఫ్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారి అనుభవరాహిత్యం ప్రజలు శాపంగా మారిందని నిప్పులు చెరిగారు.
ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు… అలాంటి అప్పుడే ప్రభుత్వ సమర్ధత తెలుస్తుందని చురకలంటించారు. పించా, అన్ననయ్య డ్యాంలో ఈ వరద నీళ్ళు వస్తున్నా ప్రజలను అప్రమత్తం చేయలేదన్నారు. హూదూద్ తుఫాన్ సమయంలో తాను చేసినా పని చేయలేక పోయారన్నారని ఆయన తెలిపారు. ప్రజలు బయట ఆర్తనాదాలు చేస్తుంటే… అసెంబ్లీలో సీఎం పొగడ్తలు చెప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడతాయని స్పష్టమవుతోందన్నారు. వరదలపై ముందే సమచారమున్నా…సర్కార్ అప్రమత్తంగా లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సమర్థతో పనిచేయాలన్నారు. సహాయక చర్యల్లో విఫలమయ్యారన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలన్నారు. వరదల్లో 60మందికి పైగా చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఇవ్వాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..