Wednesday, November 20, 2024

చంద్రబాబు ఇలాకాలో ఎన్టీఆర్ జెండా… రాజకీయాల్లోకి రావాలంటూ…

ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీడీపీ నాయకుల సైతం ఎన్టీఆర్ రాక కోసం ఎదరు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఆపార్టీ కార్యకర్తల్లో ఉంది. అయితే, తారక్ ఎప్పుడూ రాజకీయాలపై ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఆయన అభిమానులు మాత్రం బలంగా కోరుతున్నారు. అయితే  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాఖా కుప్పంలో వెలిసిన ఎన్టీఆర్ జెండా ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరిలో చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు సమక్షంలోనే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. వీలైనంత త్వరగా జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక, జూనియర్ ఎన్టీఆర్‌ మాస్ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తాత ఎన్టీ రామారావు మనవడిగా.. సినీ ఇండస్ట్రీలో అంచెంచెలుగా ఎదిగాడు. 2009 ఎన్నికలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తన స్పీచ్‌లతో యువతను ఆకట్టుకున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలా పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు పార్టీకి సేవలందిస్తానని గతంలో జూనియర్ ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీ తర్వాతి సీఎం ఎన్టీఆర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ తరుణంలోనే కుప్పంలో అభిమానులు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశాన్ని ఆకాంక్షిస్తూ జెండా ఆవిష్కరించి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, చంద్రబాబు మాత్రం తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్ చేయడంపైనే దృష్టి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తారక్ పేరుతో జెండా వెలువడం చంద్రబాబును ఇబ్బందికి గురిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement