జరుగుమల్లి (ప్రభన్యూస్): ఆదివారం ఉదయం 5 గంటల సమయం.. ప్రకాశం జిల్లాలోని చిరుకురపాడు, కె ఉప్పలపాడు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే లోతు తెలియని కొంతమంది ప్రయాణికులు ఈజీగా దాటి వెళ్లొచ్చు అనుకున్నారు. వాగులోంచి కారులో దాటేందుకు యత్నించారు..
కానీ, వరద ఉధృతికి కారు చిగురుటాకులా వణికింది. ఒక్కసారిగా కారులో ఉన్నవారికి భయం పట్టుంది. ఇక తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమోనని బిక్కుబిక్కుమంటూ.. దేవుడా ఎట్లైనా కాపాడు అని చివరి ప్రయత్నంగా మొక్కుకున్నారు. ఇంతలో అటువైపు వచ్చిన చిరుకురపాడు గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు కారును, అందులో చిక్కకున్న వారిని చూశారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కంచర్ల ప్రసాద్ తమతో దీక్ష చేస్తున్న స్వాములు వరదలో చిక్కుకున్న కారును, ప్రయాణిస్తున్న వారిని కాపాడారు. స్వయంగా అయ్యప్ప స్వామే తమకు సాయం చేశాడని, దీక్షలో ఉన్న స్వాములను పంపించి ప్రమాదం అంచున్న ఉన్న తమను కాపాడాడని సంతోషంగా చెబుతున్నారు బాధితులు.