తన వివాహానికి రావాలంటూ నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సీఎం వైఎస్ జగన్ ను కోరారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నారపురెడ్డి మౌర్య, ఆమె తల్లిదండ్రులు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌ను వివాహానికి ఆహ్వానించారు. సీఎం తప్పకుండా పెళ్లిరోజు, లేని పక్షంలో తెల్లవారి ఏర్పాటు చేసే ఫంక్షన్‌కు వస్తానన్నారని తెలిపారని మౌర్య తల్లిదండ్రులు తెలిపారు. మౌర్య, సత్యనారాయణరెడ్డిల వివాహం ఈ నెల 14న కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో జరగనుంది.
మౌర్య 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన మౌర్య ప్రస్తుతం నంద్యాల జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నారపురెడ్డి మౌర్య సొంత గ్రామం చాపాడు మండలంలోని నాగులపల్లె. ఆమె తల్లిదండ్రులు నారపురెడ్డి చంద్రఓబుళరెడ్డి, జయశ్రీ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. మౌర్య కాబోయే భర్త సత్యనారాయణరెడ్డి సొంత గ్రామం కడపలోని చిన్నచౌకు కాగా.. ఆయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.