తాను త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి, సీనియర్ నేత కొణతాల రామకృష్ణ.. ఇటివలే వైసిపికి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు. ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణలపై ఆయనతో సుదీర్ఘంగా పవన్ తో చర్చించారు.
ఈ సందర్భంగానే జనసేనలోకి రావాలసిందిగా కొణతాలను ఆహ్వానించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆరోజు పవన్ చెప్పారు. తాజగా ఆయన నేడు అనకాపల్లిలో తన అభిమానులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశఃలో మెజార్టీ సభ్యులు జనసేనలో చేరాల్సింది కొణతాలకు సూచించారు. దీంతో సమావేశం అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడుతూ తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. జనసేనాని ఆయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో చేరతానన్నారు. ప్రత్యేకంగా పార్టీ టిక్కెట్ ఇవ్వాలని కోరనని, పవన్ కల్యాణ్ ఏది సూచిస్తే దానిని పాటిస్తానని చెప్పారు.