ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ చాన్స్ కొట్టేసే చాన్స్ వచ్చింది. కేవలం ఇంటర్, డిగ్రీ చేసిన వారు కూడా ఈ జాబ్ అవకాశం దక్కించుకోవచ్చు. ఇక.. జాబ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AFCAT -02/2024) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ కోర్స్ 2025 జులై నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇది మంచి అవకాశమని, దీన్ని మిస్ చేసుకోవద్దని సూచించారు.
ఏఎఫ్ క్యాట్- 02/ 2024, NCC స్పెషల్ ఎంట్రీ
- ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ :
ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
గ్రౌండ్ డ్యూటీ (నాన్- టెక్నికల్)
- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ : ఫ్లయింగ్
ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్), బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
వయోపరిమితి
ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు మధ్యలో ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్
ఫ్లయింగ్ ఆఫీసర్లకు నెలకు రూ.56,100 – రూ.1,77,500 వరకు జీతభత్యాలు అందిస్తారు.
ఎంపిక విధానం
పోస్టులను అనుసరించి ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష పెడతారు. వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, అర్హులైన అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 మే 30
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 జూ న్ 28
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 9, 10, 11