ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో మెగా జాబ్ మేళా జరగనుంది. అక్టోబర్ 30వ తేదీన మంత్రి మేకపాటి ముఖ్య అతిథిగా ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది. మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగే మరో భారీ జాబ్ మేళాను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు. 22 పేరున్న కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొని అర్హులైన 1040 మంది ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు సుమారు 2000 మంది రావచ్చునని మంత్రి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, , మెడికవర్,హెటెరో ఫార్మా వంటివి పాల్గొంటున్నాయన్నారు. మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.apssdc.in ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యనభ్యసించిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
ఇది కూడా చదవండి: అత్యాధునిక హంగులతో ఆత్మకూరు బస్ స్టాండ్ : మంత్రి మేకపాటి