Friday, November 22, 2024

ఏపీలో మరో 9 పట్టణాల్లో జియో 5జీ

రిలయన్స్‌ జియో.. 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. మార్చి 21 నుంచి మరో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 41 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సంస్థ తెలిపింది. తాజాగా కలిసిన వాటితో దేశవ్యాప్తంగా 406 నగరాలు, పట్టణాల్లో జియో5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. కొత్తగా 5జీ కవరేజీ సేవలను అందించనున్న వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 9 పట్టణాలు ఉన్నాయి.

ఆదోని, బుద్వేల్‌, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరస్పాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభించింది. జియో 5జీ సేవలు పొందేందుకు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్టు చేసే మొబైల్‌ ఫోన్‌ ఉంటే సరిపోతుంది. సిమ్‌ కార్డు మార్చకుండా, ఎలాంటి అదనపు రుసుం చెల్లించకుడానే 1 జీబీపీఎస్‌ వేగంతో డేటాను కస్టమర్లు వినియోగించుకోవచ్చని జియో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement