Tuesday, November 19, 2024

విశాఖప‌ట్నంలో జిమెక్స్‌-22.. ముగిసిన భార‌త్‌, జ‌పాన్‌ నౌకాదళ విన్యాసాలు

భారత్‌, జపాన్‌ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్‌ 22 నౌకా విన్యాసాలు కంప్లీట్ అయ్యాయి. ఈ షో రెండు దేశాలకు చెందిన ఆరో ఎడిషన్‌. భారత నావికా దళం నిర్వహించింది. రెండు దేశాల నౌకాదళాలు ఒకరికొకరు వీడ్కోలు పలుకుతూ భారమైన హృదయాలతో వెళ్లిపోయారు. విశాఖపట్నంలో జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ 2022 (జిమెక్స్‌ 22) నౌకా విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి.

ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలోని భారత నౌకాదళ నౌకలు, కమాండర్ ఎస్కార్ట్ ఫ్లోటిల్లా ఫోర్ రియర్ అడ్మిరల్ హిరాటా తోషియుకి నేతృత్వంలోని జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్‌) షిప్‌లు ఇజుమో, తకనామి వారం రోజుల పాటు విన్యాసాల్లో పాల్గొన్నాయి.

రెండు దేశాల నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన జిమెక్స్‌ 22 పలు క్లిష్టమైన విన్యాసాలకు చిరునామాగా నిలిచింది. రెండు వైపుల నుంచి అధునాతన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ విన్యాసాల్లో నిమగ్నమయ్యాయి. ఈ నౌకాదళ విన్యాసాలు రెండు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, పరస్పర చర్యను ఏకీకృతం చేసిందని చెప్పవచ్చు. గాలి, ఉపరితలం, ఉప-ఉపరితల డొమైన్‌లపై దృష్టి సారించాయి.

భారత నౌకాదళానికి చెందిన మూడు స్వదేశీయంగా నిర్మించిన యుద్ధనౌకలు సహ్యాద్రి, స్టెల్త్ ఫ్రిగేట్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్వెట్‌లు కడ్మట్, కవరత్తి ప్రాతినిధ్యం వహించాయి. వీటికి తోడుగా గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ రణ్‌విజయ్, ఫ్లీట్ ట్యాంకర్ జ్యోతి, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్ సుకన్య, సబ్‌మెరైన్లు, ఎంఐజీ 29 కే ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, పలు నౌకలు కూడా ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement