వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ని కలిశారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని… ఇందులో భాగంగానే పాల్ ను కలిశానని చెప్పారు. అనంతరం కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్డింగ్ వేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… సొంత రాష్ట్రం తెలంగాణను కూడా కాపాడలేని వాళ్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతారా అంటూ మండిపడ్డారు.
అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీని వదిలి బయటకు రావాలని కోరారు. జనసేనను.. ప్రజాశాంతి పార్టీలో కలపాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతానని పాల్ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని… తనను అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు.