Tuesday, November 26, 2024

అనంతలో ఆసక్తికర సీన్.. పరిటాలను ఆలింగనం చేసుకున్న జేసీ

అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.  ఒకే పార్టీలో ఉన్నా ఇన్నాళ్లు పెద్దగా కలుకుకోని ఇద్దరు నేతలు ఒకే చోటకు చేరారు. గతంలో గొడవల్ని, గ్రూపుల్ని పక్కన పెట్టి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పార్టీ కార్యకర్తలకు సంకేతాలు పంపారు. వివరాల్లోకి వెళ్లితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా..ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. జిల్లా సరిహద్దులో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ వచ్చారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని పలకరించిన పరిటాల శ్రీరామ్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాన్ని జిల్లా టీడీపీ నేతలకు పంపారు. ఈ ఆసక్తికర సన్నివేశం అక్కడ ఉన్న టీడీపీ నేతలను ఆశ్చర్యం కలిగించింది.  

కాగా, అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య గతం నుంచే విభేదాలు ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్‌లో ఉండగా… పరిటాల కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత జేసీ సోదరులు టీడీపీలో చేరారు. అయితే, పార్టీ మారిన తర్వాత కూడా పరిటాల-జేసీ కుటుంబాల మధ్య పెద్దగా మాటల్లేవు. ఒకే వేదికపై ఉన్నా పెద్దగా పలకరించుకున్న సందర్భాలు తక్కువ అనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా పరిటాల శ్రీరామ్ ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించడంపై స్థానిక నేతలను ఆశ్చర్య పరిచింది.

ఇది కూడా చదవండి: మాట నిలబెట్టుకునే మగతనం లేదా?: సీఎం కేసీఆర్‌పై షర్మిల హాట్ కామెంట్

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement