తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రకటనపై టీడీపీ మాజీ ఎంపీీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు హైదరాబాద్ కు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల నియామకం ఏ రాష్ట్రమూ చేపట్టలేదన్నారు. ఖచ్చితంగా యూత్ లో క్రేజ్ వస్తుందన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే కష్టంగా మారిందన్నారు. ఇక ఉద్యోగాల భర్తీ అనేది ఎక్కడ ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టినట్లే కన్పిస్తుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే బొత్స హైదరాబాద్ ఏపీ రాజధాని అంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలవడం కష్టసాధ్యంగా మారిందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital