Friday, November 22, 2024

AP: జనసైనికుడి వీధిపోరాటం…టిక్కెట్టు ఇవ్వాలని ఆందోళ‌న‌

ఏపీలో త్రికూటమి టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో చిచ్చు రగిల్చింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు పార్టీల్లోనూ బలమైన ఆశావహులే ఇందుకు కారణం. అందరూ సీటు నాకంటే.. నాకే అంటూ పట్టుపడుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్టును తనకే ఇవ్వాలంటూ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం. అయిదేళ్లుగా కష్టపడి పని చేశా.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు శ్రమించారు. నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడింది. ఆణువణువూ నాకు తెలుసు.

జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడటం కష్టం. ఇక్కడి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గానికి పంపించటానికి మా పోరాటమే కారణం. ఇక, నాకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద నమ్మకం ఉంది.. పవన్‌ కల్యాణ్‌ రెండవ జాబితాలో నా పేరు ఉంటుందని ఆశించాను. ఆయన చెప్పడం వల్లే దూకుడు పెంచాను.. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరూ కోరుకుంటున్నారు.. నాకు సీటు ఇవ్వడమే నాయ్యం” అని పోతిన మహేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement