Tuesday, November 26, 2024

Janasena – ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం రద్దు కు పొరాడతాం – పవన్ కల్యాణ్

మంగళగిరి – జగన్ తన పాలనలో విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలో లెక్క వేసి మరీ దోచుకున్న ప్రజా ఆస్తులను ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా చట్టబద్ధంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ) తీసుకొచ్చినట్లు కనిపిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చట్టం ఒక క్రూరమైన చట్టం (డ్రాకొనియాన్ లా) అని చెప్పారు. భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కనపెట్టి పరిపాలన సాగిస్తోందని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న న్యాయవాదులతో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వల్ల ప్రజలకు ఎంత కీడు జరుగుతుందో చట్టంలోని సెక్షన్ల వారీగా న్యాయవాదులు వివరించారు. సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులకు రాజ్యంగం రక్షణ కల్పించింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఆన్నారు! సామాన్య గృహిణి నుంచి ప్రతి స్థాయి వారికీ ఈ చట్టం ఏమిటో తెలియచేస్తామని చెప్పారు…

” ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుంది ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు• న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..?• ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు ఏమిటి? రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట ఉంచుకొనేందుకే కొత్త చట్టం • భూ యాజమాన్య హక్కుల చట్టంలోని లోగుట్టు ఏమిటో సామాన్యుడికి అర్ధమయ్యేలా చైతన్యం తెస్తాం. నిస్వార్థంగా పోరాటం చేస్తున్న న్యాయవాదులకు జనసేన సంపూర్ణ మద్దతు” అని జన సేనాని ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement