డిక్లరేషన్ ప్రకటించనున్న పవన్ కల్యాణ్
ప్రస్తుతం జ్వరంతో గెస్ట్ హౌజ్ లోనే చికిత్స
జ్వరంతోనే వారాహి సభలో పాల్గొననున్న జనసేనాని
స్థానిక నేతలతో పలు అంశాలు చర్చించిన పవన్
తిరుమల – జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తన దీక్ష విరమించారు.. ఆ తర్వాత అక్కడే అతిథి గృహంలో బస చేశారు.. అయితే, ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు..
టిటిడి అదనపు ఈ వో భేటి
ఇక నేటి ఉదయం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. టీటీడీలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పవన్ కు ఆయన వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు జరుగనున్న వారాహి సభలో ఏం మాట్లాడాలన్న అంశంపై నేతలతో పవన్ చర్చించారు.
నేటి సాయంత్రం తిరుపతి వారాహి బహిరంగ సభ …
ఈ సాయంత్రం 5 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరనున్న పవన్.. 6 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగనున్న వారాహి సభలో పాల్గొంటారు. తనకు అనారోగ్యంగా వున్నా.. ఈరోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ తనను కలసిన నేతలకు చెప్పారు. ఇక, తిరుపతి వేదికగా జరిగే వారాహి బహిరంగ సభలో.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు జనసేన చీఫ్ .