Friday, November 22, 2024

ఇసుకను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తారా?

రాష్ట్రంలో ఇసుక తవ్వకాల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగమే ఇసుకను నిర్వహించలేకపోయిందన్న మనోహర్… ప్రైవేటు వాళ్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు.

ఇసుక విదానం ద్వారా మరోసారి ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఒక ఇసుక విదానం అమలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఇసుకను ప్రైవేట్ సంస్థకు అప్పగించటం వల్ల ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతోందన్నారు. మరోవైపు జేపీ సంస్థకు ఇసుక నిర్వహణ బాధ్యతను అప్పగించడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement