ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి: పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారని జనసేన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో ఉండే షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. ఒక్కో ప్రజాప్రతినిధి రెండ్రోజులపాటు కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలు స్వయంగా స్వీకరిస్తారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలో తేదీల వారీగా అందుబాటులో ఉండనున్న జనసేన ప్రజా ప్రతినిధుల వివరాలను పార్టీ కార్యాలయం వెల్లడించింది.