విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్‌కల్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని కోరారు.
విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని స్పష్టం చేశారు. పవన్ ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని.. బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని సూచించారు. వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు నగరంలోని జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.