ఒంగోలు, ప్రభన్యూస్ : ప్రకాశం జిల్లాలో అప్పుల బాధలో ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకొని, ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనసేన రైతు భరోసా యాత్ర’ ఆదివారం ప్రకాశం జిల్లాలో చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి ..యడ ్లపాడు, చిలకలూరిపేట, జాగర్లమూడి, యద్దనపూడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎస్‌కేపీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే బాధిత కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు జనసైనికులు మార్టూరు మండలం రాజుపాలెం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.
గత మూడేళ్లల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో దాదాపు 80 మంది రైతులు బలవన్మరణం పొందినట్లు జనసేన గుర్తించింది. ఆయా కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించి, ఆ కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి, ఆర్థిక సహాయంతో భరోసా కల్పించనున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న అధికారులు ఇప్పుడు హడావుడీగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.