Saturday, June 29, 2024

Jana Vani – ఆప‌న్నుల‌కు అండ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ … రోడ్డుపైనే జనసేనాని ‘ప్రజాదర్బార్’

మంగ‌ళ‌గిరి – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

వివిధ స‌మ‌స్య‌ల‌పై స్పందించిన ఆయ‌న అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి త‌మ బాధ‌లు చెప్పుకున్న వారి స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించాలంటూ ఆదేశించారు..

- Advertisement -

మిస్సింగ్ కేసు – స్వయంగా రంగంలోకి ఉప ముఖ్యమంత్రి

విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.

మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement