అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో పాటు పలు ప్రజా సమస్యలపై ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
ఉమ్మడి జిల్లాలకు టీడీపీ-జనసేన పర్యవేక్షకులు వీరే..
1.శ్రీకాకుళం- వంగలపూడి అనిత, బొమ్మిడి నాయకర్.
- విజయనగరం- బుద్దా, కోన తాతారావు.
- తూ.గో- కొల్లు, శివ శంకర్.
- ప్రకాశం- దేవినేని ఉమ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.
- అనంత- ఎన్ఎండీ ఫరూక్, చిల్లపల్లి శ్రీనివాస రావు.
- ప.గో- నక్కా, యశస్వీ.
- కృష్ణా- బండారు సత్యనారాయణ మూర్తి చేగోండి సూర్య ప్రకాష్.
- కడప- సోమిరెడ్డి, నయూబ్ కమల్.
- చిత్తూరు- బీదా రవిచంద్ర, బోలిశెట్టి సత్య.
- విశాఖ- నిమ్మల, పడాల అరుణ.
- గుంటూరు- షరీఫ్, ముత్తా శశిధర్.
- నెల్లూరు- ఎన్ అమర్నాధ్ రెడ్డి, పితాని బాలకృష్ణ.
- కర్నూలు- కాల్వ, పెదపూడి విజయ్ కుమార్.
- టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్..:
- ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప్రకాశం అనంత జిల్లాలు
- ఈ నెల 30వ తేదీన పశ్చిమ కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాలు
- ఈ నెల 31వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలు.