ఏపీలోని చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. వైఎస్సార్సీపీ లీడర్, నగర ఎమ్మెల్యే.. మంత్రి రోజాకు జనసేన లీడర్లకు మధ్య వార్ నడుస్తోంది. జనసేన పార్టీని కించపరిచేలా మాట్లాడిన రోజా క్షమాపణ చెప్పాలని, లేకుంటే తన ఇంటిని ముట్టడిస్తామని జనసేన కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున రోజా ఇంటి ముట్టడికి బయలు దేరారు. ఈ క్రమంలో తిరుపతిలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఉదయం 6 గంటల నుంచే చాలా మంది లీడర్లను హౌస్ అరెస్టు చేశారు. బైరాగిపట్టెడలో జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ హౌస్ అరెస్టు చేశారు. ఇంకొతమంది లీడర్లను కూడా పోలీసులు కట్టడి చేశారు. ఇక.. పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన విమర్శలకు వీరమహిళలు కౌంటర్ ఇస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో నగరి వచ్చి తెలుసుకోవాని రోజా సవాల్ చేయగా.. నగరి వెళ్లేందుకు చాలామంది జనసైనికులు రెడీ అయ్యారు. నగరిని దోచుకుంటోంది ఎవరో చూపిస్తామని జనసేన లీడర్లు అంటున్నారు.